Sun Dec 22 2024 19:10:39 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : అమెరికాలో రేవంత్... పెట్టుబడుల కోసం సమావేశాలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో వరస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో వరస సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిన్న న్యూయార్క్ చేరుకున్న రేవంత్ రెడ్డి బృందం ఎన్ఆర్ఐలతో సమావేశమయింది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఆహ్వానించింది. ప్రభుత్వం ఏ మేరకు రాయితీలు ఇస్తుందన్నది కూడా ఈ సమావేవాల్లో వివరించనుంది. నేడు రేవంత్ రెడ్డి బృందం న్యూయార్క్ లో వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకునే వీలుంది.
పెట్టుబడులు పెట్టేందుకు...
అమెరికాలో పర్యటించేందుకు రేవంత్ రెడ్డి బృందం వెళ్లిన సంగతి తెలిసిందే. ఎనిమిది రోజుల పాటు అమెరికాలో, రెండు రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించనుంది. తెలంగాణ అభివృద్ధికి సహకారం అందించాలని ఇప్పటికే ఎన్ఆర్ఐలను కోరిన రేవంత్ రెడ్డి ఇక్కడ పెట్టుబడులు పెట్టి రాష్ట్రాభివృద్ధికి సాయపడాలని కోరనున్నారు. దీంతో పాటు పెట్టుబడులు పెట్టిన వారికి ప్రత్యేక రాయితీలను ప్రకటించనున్నారు. ప్రముఖ సంస్థల ప్రతినిధులతో భేటీ అయి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు.
Next Story