Thu Dec 26 2024 13:46:18 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు ప్రధానితో రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశముంది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశముంది. డిప్యూటీ సీఎంతో కలసి ప్రధాని నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి కలవనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రి అమిత్ షాతో కూడా రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఉదయం 11.30 గంటలకు అమిత్ షాను, మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు.
బడ్జెట్ లో కేటాయింపులు...
తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో అధిక నిధులను కేటాయించాలని కోరనున్నారు. ప్రధాన సమస్యలను ఇద్దరి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి సహకరించాలని ప్రధాని, హోం మంత్రిని కలవనున్నారు. తెలంగాణ ఏర్పాటయిన తర్వాత అనేక విభజన సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయన్న విషయం ఈ సందర్భంగా వారికి వినతి పత్రం ద్వారా అందచేయనున్నారు.
Next Story