Sun Mar 30 2025 12:11:06 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ఢిల్లీలో నేడు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరిన రేవంత్ ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు ఉదయం భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తో సమావేశం అవ్వనున్నారు. అయితే ఎందుకోసం ఈ సమావేశం జరుగుతుందన్నది మాత్రం స్పష్టత రావడం లేదు. రేవంత్ రెడ్డి ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు కోసమేనా?
అయితే దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో చర్చించేందుకే స్వయంగా రేవంత్ కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ ను కలుస్తున్నారని భావిస్తున్నారు. ఈ కేసులో నిందితులు విదేశాల్లో ఉండటంతో వారిపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు. వారిని భారత్ కు రప్పించేందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో నేరుగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తో సమావేశం అవుతున్నారన్న చర్చ జరుగుతుంది.
Next Story