Mon Dec 23 2024 15:28:57 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : దావోస్ బయలుదేరి వెళ్లిన రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా దావోస్ కు వెళ్లారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రేవంత్ దావోస్ పర్యటన సాగనుంది. ఈరోజు నుంచి 19వ తేదీ వరకూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు.
మూడు రోజుల పాటు...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించి ఇక్కడ కంపెనీలను తేవాలన్న లక్ష్యంతో ఆయన పర్యటన సాగనుంది. కంపెనీలకు ఇవ్వనున్న ప్రోత్సహకాలు, రాయితీలను గురించి ఈ సమవేశంలో రేవంత్ రెడ్డి ప్రస్తావించనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు కూడా దావోస్ కు బయలుదేరి వెళ్లారు. మూడు రోజుల పాటు రేవంత్ బృందం దావోస్ లోనే పర్యటిస్తుంది.
Next Story