Wed Nov 27 2024 00:44:51 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన రేవంత్
ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు
ఢిల్లీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి వెంట డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు కూడా ఉన్నారు. లోక్సభ ఎన్నికలపై చర్చించేందుకు వీరు ఢిల్లీకి వెళ్లినట్లు తెలిసింది. దీంతో పాటు మంత్రి వర్గ విస్తరణపై కూడా పార్టీ హైకమాండ్ తో చర్చలు జరిపే అవకాశముందని తెలిసింది. దీంతో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి కాంగ్రెస్ పార్టీలో నెలకొంది.
మూసీ అభివృద్ధిపై...
మూసీ నది ప్రాంతంలో అభివృద్ధిని వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హెచ్ఎండీఏ కార్యాలయంలో ఆయన మూసీ నదీ పరివాహక ప్రాంతం అభివృద్ధిపై సమీక్షను నిర్వహించారు. మూసీ నది అభివృద్ధి ప్రక్రియను వీలయినంత త్వరగా ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. మొదట మూసీ నదిని శుద్ధిచేయాలన్న రేవంత్ రెడ్డి చారిత్రక కట్టడాలను కలిపేలా మూసి నది అభివృద్ధి పనులు కొనసాగాలని ఆయన సూచించారు. ఈ మేరకు ప్లాన్ ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
Next Story