Thu Dec 19 2024 05:00:15 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : తెలుగు కేంద్ర మంత్రులకు రేవంత్ విజ్ఞప్తి ఏంటంటే?
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు కేంద్ర మంత్రులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక వినతి చేశారు
తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు కేంద్ర మంత్రులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక వినతి చేశారు. నిన్న మోదీ కేబినెట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఐదుగురు మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతి రాజు శ్రీనివాసవర్మకు ఎక్స్ లో రేవంత్ రెడ్డి శుభాకాంక్షలతో పాటు అభినందనలు తెలిపారు.
విభజన హామీలు...
అయితే ఈ సందర్భంగా ఈ ఐదుగురు మాత్రం తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని కోరారు. నిధులు, పధకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు. దీంతో పాటు విభజన హామీలను కూడా అమలు చేయాలని కోరారు. విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా ఇంకా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Next Story