Sun Dec 22 2024 17:49:15 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : అల్లు అర్జున్ అరెస్ట్ పై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
అల్లు అర్జున్ అరెస్ట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.
అల్లు అర్జున్ అరెస్ట్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అతని వల్ల ఒక మహిళ చనిపోయిందని, కుమారుడు కోమాలోకి వెళ్లారని తెలిపారు. ఒక హిందీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఘటనపై క్రిమినల్ కేసు నమోదయిందన్నారు. కారులో వచ్చి సైలెంట్ గా సినిమా చూసి వెళ్లిపోయి ఉంటే ఏమయ్యేది కాదన్నారు. అల్లు అర్జున్ భార్య తనకు బంధువులేనని ఆయన తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ తో తన ప్రమేయం లేదన్న రేవంత్ రెడ్డి చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
పాకిస్థాన్ తో యుద్ధం చేసి వచ్చారా?
ఫిలింస్టార్, పొలిటికల్ స్టార్ల కోసం ప్రత్యేక చట్టం ఏమీ ఉండదని రేవంత్ రెడ్డి తెలిపారు. హోంశాఖ తన వద్ద ఉందని, ఆ రిపోర్టు తనకు తెలుసునని రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన సినిమా చేశాడని, డబ్బులు సంపాదించుకున్నాడన్నారు. ఆయనేమైనా పాకిస్థాన్ తో యుద్ధం చేసి వచ్చారా? అని ప్రశ్నించారు. కారులో నుంచి బయటకు వచ్చిహడావిడి చేయడంతోనే తొక్కిసలాట జరిగిందన్న రేవంత్ రెడ్డి సినిమా వాళ్లు డబ్బులు పెట్టారని, సంపాదించుకున్నారన్నారు. ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరు పూడుస్తారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Next Story