Mon Dec 15 2025 03:53:03 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : హైడ్రా పై అసలు విషయం చెప్పిన రేవంత్
హైడ్రా పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

హైడ్రా పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తూ హైడ్రా హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితమని తెలిపారు. జిల్లాల నుంచి అనేక వినతులు వస్తున్నప్పటికీ హైడ్రా హైదరాబాద్ వరకే పరిమితం అవుతుందని తెలిపారు. చెరువులను, నాలాలను ఆక్రమించినా ఏ నిర్మాణాన్ని అయినా కూల్చివేస్తామని తెలిపారు. తొలుత తమ పార్టీకి చెందిన పల్లంరాజు ఫామ్ హౌస్ ను కూల్చివేశామన్నారు.
చెరువులు, నాలాలు...
తన బంధువులు ఎవరికైనా బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉంటే సమాచారం ఇవ్వాలని, తానే కూల్చివేస్తానని తెలిపారు. జువ్వాడ ఫాం హౌస్ ను కేటీఆర్ లీజుకు తీసుకున్నానని చెబుతున్నారని, అదే జరిగితే ఎన్నికల అఫడవిట్ లో చూపించాలి కదా?అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చెరువులు, పార్కులు, నాలాలపై ఆక్రమణల తొలగింపునకే ప్రస్తుతం హైడ్రా పరిమితమవుతుందని తెలిపారు. నగరంలో జలాశయాలను పరిరక్షించడమే తమ ధ్యేయమని తెలిపారు.
Next Story

