Sun Dec 22 2024 03:25:11 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : సోనియా, రాహుల్ తో రేవంత్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఢిల్లీలో పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి టెన్జన్పథ్ కు వెళ్లి సోనియాను కలిశారు. అక్కడే ఉన్న రాహుల్ తో కూడా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వందరోజుల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఏమేమి అమలు చేసిందీ వారికి రేవంత్ రెడ్డి వివరించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి వాటిని అమలు చేస్తున్నామని ఈ సందర్భంగా రేవంత్ వారితో చెప్పినట్లు సమాచారం.
పార్లమెంటు ఎన్నికల్లో...
అదే సమయంలో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ నుంచి పథ్నాలుగు పార్లమెంటు స్థానాలలో విజయం సాధించే దిశగా తాము ప్రయత్నిస్తున్నట్లు కూడా రేవంత్ వారికి వివరించినట్లు తెలిసింది. పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ వారితో చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంతో పాటు బీఆర్ఎస్, బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి నేతలను తీసుకోవడం వంటి విషయాలపై కూడా వారితో రేవంత్ చర్చించినట్లు చెబుతున్నారు.
Next Story