Sun Nov 24 2024 11:03:40 GMT+0000 (Coordinated Universal Time)
గిరిజన బాలికకు సీఎం ఆర్థిక సాయం
గిరిజన బాలిక సాయిశ్రద్దకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం అందించారు
గిరిజన బాలిక సాయిశ్రద్దకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్ధిక సాయం అందించారు. కుమురం భీం జిల్లా,జైనూరు మండలం, జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన బాలిక సాయిశ్రద్ధ ఎంబీబీఎస్ లో సీటు సాధించింది. అయితే కాలేజీ ఫీజు కట్టేందుకు ఆర్ధిక స్థోమత లేక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్న స్థితిలో ఈ విషయం రేవంత్ రెడ్డి దష్టికి వచ్చింది.
వైద్య విద్యను చదివేందుకు...
తన దృష్టికి వచ్చిన వెంటనే డాక్టర్ కావాలన్న ఆ అమ్మాయి కల నెరవేర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చి ఆర్ధిక సాయం అందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి సాయిశ్రద్ధ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వమే ఆమె వైద్య చదువుకు అయ్యే ఖర్చును భరిస్తుందని తెలిపారు.
Next Story