Mon Dec 23 2024 07:28:27 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి.. సోనియాగాంధీని కలసి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలవనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. నిన్న కేరళ వెళ్లిన రేవంత్ రెడ్డి రాత్రి అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కానున్నారు. సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలను రేవంత్ రెడ్డి ఈరోజు కలవనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఆవిర్భావ వేడుకలు...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీని ప్రత్యేక అతిధిగా ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. జూన్ 2వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించాలని తలపెట్టింది. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిిసిందే.
Next Story