Sat Jan 11 2025 14:40:43 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదు
కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి బీఆర్ఎస్, బీజేపీలు డ్రామాలు మొదలుపెట్టాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి బీఆర్ఎస్, బీజేపీలు డ్రామాలు మొదలుపెట్టాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కల్వకుంట్ల కవిత అరెస్ట్ కూడా అందులో భాగమేనని అన్నారు. ఈసారి మోడీ, ఈడీ ఒకేసారి తెలంగాణకు వచ్చాయని ఆయన అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నాయని అన్నారు. రెండు పార్టీల ఎత్తుగడలో భాగమే కవిత అరెస్ట్ అని అన్నారు. ప్రభుత్వం పడగొట్టే పని వాళ్లు చేస్తే, నిలబెట్టే పనిలో తాము ఉంటామని చెప్పారు. తన పనిని తాను చేయినిస్తే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. వందరోజుల కాంగ్రెస్ పాలన సంతృప్తిని ఇచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రయోజనాలే...
భేషజాలకు, పంతాలకు, పట్టింపులకు పోకుండా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవడానికే తాము ప్రయత్నిస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోపే ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు పర్చామని తెలిపారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలన్నదే మన ఉద్దేశ్యమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీ జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. పదేళ్లలో వంద సంవత్సరాలకు సరిపడా విధ్వంసం జరిగిందన్నారు. తమ జోలికి రావద్దని, వస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. అన్ని వర్గాలకు న్యాయం చేయాలన్న లక్ష్యంతోనే తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు.
Next Story