Sun Dec 22 2024 13:33:49 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : మమ్మల్ని గోకారంటే.. గోల గోల తప్పదంతే
ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మణుగూరులో ఆయన మాట్లాడుతూ ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు రాష్ట్ర కేబినెట్లో ఉన్నారన్నారు. ఇటీవల రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలను భర్తీ చేస్తే అందులో ఖమ్మం జిల్లా నుంచి రేణుక చౌదరిని అధినాయకత్వం ఎంపిక చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఖమ్మం జిల్లాకు టాప్ ప్రయారిటీ ఇస్తుందని రేవంత్ రెడ్డి తెలాపారు. మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలు సోనియా గాంధీ కారణంగానే ఈ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు.
పదేళ్ల పాలనలో...
పదేళ్ల పాలనలో తెలంగాణను బీఆర్ఎస్ నాశనం చేసిందని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. అందుకే బీఆర్ఎస్ ను ఖమ్మం ప్రజలు కేసీఆర్‌ను నమ్మలేదన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయిస్తామని చెప్పి కేసీఆర్ అందరినీ నిలువునా మోసం చేశారన్నారు. ఇళ్లులేని పేదవారికి, పెళ్లయిన ప్రతి పిల్లవాడికి ఇల్లు ఇవ్వాలన్నదే కాంగ్రెస్ నిర్ణయమని ఆయన తెలిపారు. ఈ ప్రభుత్వం మంచి చేస్తున్నా ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు ప్రతి రోజూ శాపనార్థాలు పెడుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలు ధైర్యంగా పోరాడారన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ, ప్రభుత్వం కూడా కార్యకర్తల సేవలను విస్మరించదని అన్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అద్భుతమైన విజయం సాధించడానికి కార్యకర్తలే కారణమని తెలిపారు.
బిర్లా రంగా సమితి అంటూ...
బీఆర్ఎస్ అంటే బిర్లా రంగా సమితి అని రేవంత్ రెడ్డి అన్నారు. మీ అయ్య ఒక చార్లెస్ శోభరాజ్ అని కేటీఆర్‌పై విమర్శలు చేశారు. ప్రాజెక్టుల పేరుతో అబ్బాకొడుకులు, మామ అల్లుళ్లు అడ్డంగా కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు. మాతో గోక్కోవద్దు అని, గోక్కున్న వాడు ఎవరూ బాగుపడలేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎక్కడుందని ఎద్దేవా చేశారని, అదే కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. సీతారాం ప్రాజెక్టుకు సంబంధించి పనులను వేగరం చేపడతామని తెలిపారు. కార్యకర్తలే కాంగ్రెస్ బలమని, ఎవరు అడ్డం వచ్చినా బండ పెట్టి పాతిపెట్టడం ఖాయమని ఆయన అన్నారు.
Next Story