Mon Apr 21 2025 15:59:02 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Redddy : ఇక జిల్లాల్లోనూ హైడ్రా : రేవంత్ రెడ్డి
జిల్లాల్లోనూ హైడ్రా వంటి వ్యవస్థలను తీసుకువస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు

జిల్లాల్లోనూ హైడ్రా వంటి వ్యవస్థలను తీసుకువస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చెరువులను ఆక్రమించి ఎక్కడ నిర్మాణాలు చేపట్టినా వదలబోమన్నారు. ఇటు వరద ముంపును కాపాడటంతో పాటు తగినంత తాగునీటిని భవిష్యత్ తరాల వారికి అందించగలుగుతామని తెలిపారు. హైడ్రా లాంటి వ్యవస్థ వల్లనే అక్రమ నిర్మాణాలను తొలగించడం సాధ్యమవుతుందని తెలిపారు.
అక్రమ నిర్మాణాలను...
మహబూబాబాద్ జిల్లా పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి అధికారుల సమీక్షలో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అనేది ఒక సదుద్దేశ్యంతో ఏర్పాటు చేసిన సంస్థ అని అన్నారు. హైడ్రా సంస్థ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఎక్కడా ఆగలేదని ఆయన తెలిపారు. రాంనగర్ నాలాపై అక్రమకట్టడాలను తొలగించడం వల్ల ఈరోజు ముప్పు తప్పిందని రేవంత్ రెడ్డి అన్నారు.
Next Story