Fri Dec 27 2024 11:55:12 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : వారికి శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి
నిరుద్యోగులు విపక్షాల ట్రాప్ లో పడొద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
నిరుద్యోగులు విపక్షాల ట్రాప్ లో పడొద్దంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే తాము ఉద్యోగాలను ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే భర్తీ చేస్తామని తెలిపారు. ఈరోజు సెక్రటేరియట్ లో సివిల్స్ మెయిన్స్ కు అర్హత సాధించిన 135 మందికి లక్ష రూపాయల చొప్పున రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ముప్పయి వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందచేశామని తెలిపారు.
ఏ సమస్య అయినా...
అదీ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోగానే ఇచ్చామన్న రేవంత్ రెడ్డి నిరుద్యోగ సమస్యకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపుతుందన్నారు. గత ప్రభుత్వం ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని, తాము నోటిఫికేషన్లు ఇస్తుంటే పరీక్షలు వాయిదా వేయాలని ఆందోళన చేస్తున్నారు. ఇది రాజకీయ ప్రేరేపితమైన ఆందోళన అని అన్నారు. విద్యార్థులను రెచ్చకొట్టి కొందరు రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నిరుద్యోగుల సమస్యల పట్ల ఈ ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్న రేవంత్ రెడ్డి త్వరలోనే మరిన్ని నియామకాలు చేపడతామని అన్నారు.
Next Story