Sun Apr 06 2025 06:04:54 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. కేసీఆర్ను ఆహ్వానించేందుకు
లంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ ను ఆహ్వానించాలని నిర్ణయించారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆహ్వానించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలను ఒకరోజు ముందుగానే ముగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 13 వ తేదీ వరకూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉంది.
13న కాళేశ్వరానికి...
కానీ పన్నెండో తేదీ వరకే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరపాలని భావిస్తుంది. 13వ తేదీన కాళేశ్వరం సందర్శనకు ఎమ్మెల్యేలను తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ సందర్శనకు కేసీఆర్ ను ఆహ్వానించాలని, ఈ బాధ్యతను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పగించినట్లు తెలిసింది. 13న నల్లగొండలో బీఆర్ఎస్ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.
Next Story