Sun Dec 22 2024 12:14:41 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. యాదాద్రిలో కీ డెసిషన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నది వద్ద పాదయాత్ర చేపట్టారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నది వద్ద పాదయాత్ర చేపట్టారు. సంగెం వద్ద ఆయన భీమలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు మురుగునీటిని రేవంత్ రెడ్డి పరిశీలించారు. మూసీ నదిలో ఉన్న నీటి కాలుష్యాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. నల్లగొండ జిల్లాలో మూసీ నది ఎంత కాలుష్యమైనదీ ఆయన స్వయంగా పరిశీలించారు. సంగెం నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించారు. మొత్తం 2.5 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేయనున్నారు.
మూసీ పునరజ్జీవ సంకల్ప యాత్ర...
రేవంత్ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా మూసీ పునరుజ్జీవ యాత్రను చేపట్టారు. ఈ పాదయాత్రలో రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకోనున్నారు. మూసీ నది పునరుజ్జీవంపై వారి అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. రేవంత్ రెడ్డి యాదాద్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలతో బయలుదేరి సంగెంకు చేరుకుని మూసీ నది పరివాహక ప్రాంతంలో పాదయాత్రను ప్రారంభించారు. సాయంత్రం నాగిరెడ్డి పల్లిలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు.
Next Story