Fri Mar 21 2025 00:21:54 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : నంది అవార్డు పేరు మార్చిన రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. గద్దర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళులర్పించారు. రాష్ట్రంలో నంది అవార్డు పేరును ఇకపై గద్దర్ అవార్డుగా మారుస్తున్నట్లు ప్రకటించారు. తన మాటే శాసనం, తన మాటే జీవో అని ఆయన అన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన ప్రజా గాయకుడు గద్దర్ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. గద్దర్ ప్రజలను తన పాటల ద్వారా చైతన్యం చేశారన్నారు.
అందరూ ఆమోదిస్తారని...
తన నిర్ణయాన్ని అందరూ ఆమోదిస్తారని రేవంత్ అన్నారు. సహచర మంత్రుల ఆమోదం కూడా తన నిర్ణయానికి ఉంటుందన్నారు. ప్రతి ఏటా గద్దర్ జయంతి రోజున సినిమా అవార్డుల ప్రదానం ఉంటుందని అన్నారు. కళకారులను గద్దర్ పేరిట గౌరవించుకోవడం సముచితమని ఈనిర్ణయాన్ని తీసుకున్నట్లు రేవంత్ తెలిపారు. ఈసారి గద్దర్ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది.
Next Story