Thu Dec 26 2024 13:40:41 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రేవంత్ రెడ్డి ట్వీట్.. ఈ ఫొటో చూస్తే చాలదూ అంటూ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం విద్యార్థినులకు ఏరకంగా ఉపయోగపడుతుందో వివరించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణం విద్యార్థినులకు ఏరకంగా ఉపయోగపడుతుందో వివరించారు. "సిద్ధిపేట జిల్లా, నంగునూరు మండలం, మగ్దుంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఈ బాలికలను చూస్తుంటే ఆనందంగా ఉంది. ఊరికి కిలో మీటర్ దూరాన ఉన్న పాఠశాలకు రూపాయి ప్రయాణ ఖర్చు లేకుండా వెళ్లగలుగుతున్నారు. ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సులో “ఉచిత ప్రయాణ పథకం” వల్ల మేం ఉచితంగా బస్సెక్కి స్కూలుకు వెళ్లగలుగుతున్నాం అని తమ చేతిలో ఆధార్ కార్డులు చూపిస్తూ వాళ్లంతా సంతోషం వ్యక్తం చేస్తుంటే… ఒక జర్నలిస్టు మిత్రుడు ఇలా ఫోటో తీసి పంపాడు"ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం...
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎంతగా ఉపయోగపడుతుందో ఈ ఫొటో చూస్తే అర్థమవుతుందన్నారు. విద్యార్థులు పైసా ఖర్చు లేకుండా ప్రయాణించి సురక్షితంగా పాఠశాలలకు చేరుకుని తాము చదువుకోవడానికి ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే పద్ధతిలో బాలికలు పాఠశాలలకు వెళ్లి చదువులో రాణించి మంచి భవిష్యత్ ను సంపాదించుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Next Story