Sun Mar 30 2025 10:40:11 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఆయన ఢిల్లీ వెళుతున్నారు. తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ తో కలసి రేవంత్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ ను కలసి పార్టీ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.
మరోసారి రేపు...
ఈరోజు రాత్రికి ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుని, తిరిగి రేపు రేవంత్ ఢిల్లీ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు మహిళ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లి ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. తెలంగాణలో ఖాళీ అవుతున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగింటిని కాంగ్రెస్ గెలుచుకునే ఛాన్స్ ఉండంతో నలుగురు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
Next Story