Thu Nov 21 2024 20:52:41 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రేపు రేవంత్ గుడ్ న్యూస్ ఇవ్వనున్నారా? బర్త్డే రోజున శుభవార్త చెప్పనున్నారా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు. రేపు గుడ్ న్యూస్ చెప్పనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా రేవంత్ రెడ్డి తొలుత యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళతారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి నల్లగొండ జిల్లాల్లో మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి దాదాపు ఎనిమిది కిలో మీటర్ల మేరకు పాదయాత్ర చేస్తారని ఇప్పటి వరకూ సమాచారం అందింది. అయితే రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజు కావడంతో రేపు ఆయన తన నోటి నుంచి గుడ్ న్యూస్ చెప్పే అవకాశముందని తెలిసింది.
మూసీ నది పరివాహక ప్రాంతంలో...
మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పర్యటన చేస్తున్న సందర్భంగా మూసీ ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితులకు ఆయన ఏదైనా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్యాకేజీలను సిద్ధం చేశారు. అప్పుడప్పుడు బహిరంగ సమావేశాల్లో ప్రస్తావన తప్ప మూసీ నిర్వాసితులకు స్పష్టమైన ప్యాకేజీని అధికారికంగా ఇంత వరకూ ప్రకటించలేదు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి సుందరీకరణ నేపథ్యంలో ఇళ్లు కోల్పోయిన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇ్తామని తెలిపారు. అదే సమయంలో పెద్ద భవనాలను కోల్పోయిన వారికి రెండు వందల చదరపు గజాల ఇంటి స్థలాలను ఇస్తామని సమాచారం అందించారు.
రేపు అధికారికంగా...
ఈ విషయం రేవంత్ రెడ్డి అధికారికంగా రేపు ప్రకటించే అవకాశముందని తెలిసింది. అవసరమైతే కొన్ని చోట్ల ఎక్కువ చదరపు గజాల స్థలాలను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టును అమలు చేయాలన్న కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ ప్రాజెక్టు తన హయాంలో పూర్తి చేయాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. అందుకే రేపు తన పుట్టిన రోజు సందర్భంగా ప్యాకేజీ అధికారికంగా ప్రకటించే అవకాశముందని తెలిసింది. మరి ఇది సమయం కాదని ఊరుకుంటారా? లేక మరొక రోజు ప్యాకేజీని అధికారికంగా ప్రకటిస్తారా? అన్నది సాయంత్రానికి తేలనుంది. మొత్తం మీద 90 శాతం రేపు తన పుట్టిన రోజు నాడు మూసీ నిర్వాసితులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Next Story