Sun Dec 22 2024 19:18:01 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 20న వేములవాడకి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 20వ తేదీన వేములవాడకు రానున్నారు. గల్ఫ్ బాధిత కుటుంబాలకు చెక్ లను అందచేయనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 20వ తేదీన వేములవాడకు రానున్నారు. వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి వేములవాడ వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ నేతలతో సమావేశమై ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాల వివరాలను తీసుకుని దాని ప్రకారం భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
గల్ఫ్ బాధితులకు...
అయితే ఈ నెల 20వ తేదీన వేములవాడలో జరిగే బహిరంగ సభలో గల్ఫ్ బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్గ్రేషియా పంపిణీ చేయనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17 మంది గల్ఫ్ మృతుల వారసులకు ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లింపు కోసం రూ.85 లక్షల రూపాయలను ఇప్పటికే ప్రభుత్వం కేటాయించింది.
Next Story