Sat Dec 21 2024 05:06:16 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ఇరిగేషన్ పై నేడు రేవంత్ సమీక్ష
నేడు నీటిపారుదల శాఖ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు
నేడు నీటిపారుదల శాఖ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. గత పదేళ్లలో తెలంగాణలో నీటిపారుదల శాఖలో ఖర్చు చేసిన వ్యయంతో పాటు నిర్మించిన ప్రాజెక్టులు, ఎన్ని ఎకరాలకు నీరు ఇచ్చింది? ప్రాజెక్టుల పరిస్థితి, కాంట్రాక్టు ఒప్పందాలు వంటి వాటిపై ఈ సమీక్షలో చర్చకు రానున్నాయని చెబుతున్నారు.
ప్రాజెక్టులో జరిగిన...
ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజీపై పిల్లర్ కుంగి పోవడంతో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇరిగేషన్ శాఖ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్మాణంపై న్యాయ విచారణ, పెండింగ్ పనులపై చర్చ జరగనుంది. ఈ సమీక్షకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
Next Story