Mon Dec 23 2024 18:17:08 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు, రేపు ఢిల్లీలో రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. నిన్న మహారాష్ట్రకు వెళ్లిన రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీకివెళ్లనున్నారు. ఢిల్లీలో నేడు పార్టీ పెద్దలతో మాట్లాడనున్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. దీంతో పాటు ఇతర పార్టీల నుంచి నేతల వస్తుండటంతో వారి విషయంపై కూడా పార్టీ పెద్దలతో చర్చించనున్నారు.
రేపు కూడా...
ఈరోజు ఢిల్లీలో ఉండే రేవంత్ రెడ్డి రేపు కూడా అక్కడే ఉండనున్నారు. రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణలో పథ్నాలుగు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించే దిశగా రేవంత్ రెడ్డి అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ పీసీసీ చీఫ్ గా పర్యవేక్షణ చేయనున్నారు.
Next Story