Mon Dec 23 2024 17:44:19 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన రోజునే కాగ్నిజెంట్ నూతన క్యాంపస్ ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కాగ్నిజెంట్ నూతన క్యాంపస్ ను ప్రారంభించనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కాగ్నిజెంట్ నూతన క్యాంపస్ ను ప్రారంభించనున్నారు. సాయంత్రం ఐదు గంటలకు కోకాపేటలో ఈ క్యాంపస్ ను ప్రారంభిస్తారు. ఇటీవల అమెరికా పర్యటనలో కాగ్నిజెంట్ విస్తరణకు రేవంత్ రెడ్డి బృందం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆయన అమెరికా, దక్షిణ కొరియా పర్యటన నుంచి వచ్చిన రోజునే ఈ క్యాంపస్ ను ప్రారంభిస్తుండటం విశేషం.
కొద్దిసేపటి క్రితం...
విదేశీ పర్యటనను ముగించుకుని రేవంత్ రెడ్డి బృందం కొద్దిసేపటి క్రితం శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంది. రాష్ట్రానికి పెట్టుబడులు లక్ష్యంగా ఆయన కొన్ని రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. వివిధ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ కు చేరుకోవడంతో ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
Next Story