Wed Dec 18 2024 20:43:01 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు కాంగ్రెస్ నేతలతో రేవంత్ సమావేశం... కీలక అంశాలివే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. పీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత తొలిసారి పీసీసీ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ప్రధానంగా ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలను జనంలోకి తీసుకెళ్లడంపై నేతలకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే కొన్ని గ్యారంటీలను అమలులోకి తెచ్చామని, తాజాగా రైతు రుణమాఫీని కూడా అమలు చేస్తుండటంతో ప్రజల్లోకి బలంగా ప్రచారం చేయాలని నేతలకు సూచించనున్నారు.
ప్రజల వద్దకు...
రైతు రుణమాఫీ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కానుండంతో అందరూ ఒక పండగలా దీనిని వాడవాడలా నిర్వహించేలా పీసీసీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయాలపై కూడా రేవంత్ రెడ్డి నేతలతో చర్చించనున్నారు. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు పథకాల పట్ల అవగాహన పెంచేలా ప్రయత్నించాలని రేవంత్ రెడ్డి నేతలకు సూచించనున్నారు. దీంతో నామినేటెడ్ పోస్టులపై కూడా చర్చించనున్నట్లు తెలిసింది.
Next Story