Wed Dec 25 2024 13:21:57 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ఐదు రోజుల నుంచి ఢిల్లీలోనే రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. దీంతో ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన రద్దయింది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కూడా ఢిల్లీలోనే ఉండనున్నారు. దీంతో ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన రద్దయింది. ఆయన ఈరోజు వరంగల్ లో పర్యటించాల్సి ఉంది. వరంగల్ లో కాంగ్రెస్ సభ జరగాల్సి ఉంది. అయితే రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ఉండటంతో సభను రేపటికి వాయిదా వేసింది. ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఐదు రోజుల నుంచి ఉంటున్నారు.
టీపీసీసీ అధ్యక్ష పదవిపై...
కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకారానికి అని వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడే మకాం వేశారు. పార్టీ పెద్దలను కలసి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి పై చర్చించనున్నారు. కాంగ్రెస్ ముఖ్యనేతలో సమావేశమై కేబినెట్ విస్తరణపై కూడా ఆయన క్లారిటీ తీసుకోనున్నారు. దీంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలోనూ పార్టీ పెద్దల నుంచి అంగీకారం తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో రేవంత్ రెడ్డి పర్యటన నేడు కూడా ఢిల్లీలో కొనసాగనుంది.
Next Story