Thu Mar 27 2025 07:07:12 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : ఈ నెల 8వ తేదీన రేవంత్ పాదయాత్ర?
ఈ నెల 8వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపడతారని తెలిసింది

ఈ నెల 8వ తేదీన రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపడతారని తెలిసింది. మూసీ నది వెంట రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని పార్టీ కోరనున్నట్లు తెలిసింది. ఈ నెల 8వ తేదీన రేవంత్ రెడ్డి పుట్టిన రోజు. ఆరోజు కుటుంబ సభ్యులతో కలసి రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారని చెబుతున్నారు.
యాదాద్రి దర్శనం
అయితే అక్కడ దర్శనం పూర్తి అయిన తర్వాత మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేయాలని నల్లగొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కోరనన్నారు. ఈరోజు మధ్యాహ్నం నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు రేవంత్ ను మారేపల్లి నుంచి అనంతసాగరం వరకూ పాదయాత్ర చేస్తానని రేవంత్ ఇటీవల చెప్పడంతో తొలి విడతలో నల్లగొండ జిల్లాలో పాదయాత్ర చేపట్టాలని కోరనున్నారు. పాదయాత్రపై ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Next Story