Sun Dec 22 2024 08:30:19 GMT+0000 (Coordinated Universal Time)
Revanth : నేడు ఆదిలాబాద్ జిల్లాకు రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ నేడు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొటారు. అనంతరం జరిగే కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నామినేషన్ కార్యక్రమంలో...
లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అత్యధిక స్థానాల్లో గెలిపించే దిశగా ఆయన పర్యటనలు సాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకు బయలుదేరి వెళతారు.
Next Story