Thu Dec 19 2024 06:21:28 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు కర్ణాటకలో రేవంత్ ప్రచారం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటకలో పర్యటించ నున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటకలో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో కలసి రేవంత్ రెడ్డి పలుచోట్ల ప్రచారాన్ని నిర్వహిస్తారు. దశల వారీగా కర్ణాటకలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.
తెలుగు ప్రజలు...
తెలుగుప్రజలను ఆకట్టుకునేందుకు రేవంత్ రెడ్డి అక్కడ పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని చేయనున్నారు. తెలుగు వారిని కాంగ్రెస్ కు అండగా నిలవడంలో ఆయన తన వంతు పాత్రను పోషిస్తున్నారు. కర్ణాటకలో ప్రచారం చేసిన అనంతరం తిరిగి ఈరోజు రాత్రికి హైదరాబాద్ కు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
Next Story