Fri Dec 20 2024 07:07:10 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు సీతారామ ఎత్తిపోతల పథకం ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. సీతారామ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి పంపులను ఆన్ చేయనున్నారు. ఈ ఎత్తిపోతల పథకం వల్ల ఖమ్మం జిల్లాలో కొత్తగా 3.29 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది.
ఖమ్మం జిల్లాలోని రైతులకు...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో సీతారామ పంప్ హౌస్ 2 ప్రారంభించి రాష్ట్ర ప్రజలకు అంకితం చేయనున్నారు. గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 3.45 లక్షల ఎకరాల స్థిర ఆయకట్టుకు సాగునీరందించే లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు పనులు పూర్తి కావడంతో దీనిని నేడు రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
Next Story