Mon Feb 03 2025 15:58:00 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ప్రొద్దుటూరుకు సీఎం రేవంత్ రెడ్డి.. చిరంజీవితో కలసి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రొద్దుటూరులో పర్యటించనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రొద్దుటూరులో పర్యటించనున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.ప్రొద్దుటూరులో 150 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన 'ఎక్స్ పీరియం' పార్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
భారీ బందోబస్తు...
అయితే ఈ కార్యక్రమానికి ఒక విశిష్టత ఉంది. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొంటున్నారు. దీంతో అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా ప్రజలు, అభిమానులు వస్తారని తెలియడంతో ప్రొద్దుటూరులో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు.
Next Story