Sun Dec 22 2024 09:08:53 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : నేడు వేములవాడకు సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వేములవాడలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. వేములవాడలో ఆయన పర్యటించనున్నారు. వేములవాడ రాజన్నను దర్శించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వేములవాడలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు.
127 కోట్లతో...
ఇప్పటికే వేములవాడ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 127.65 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఈ నిధులను విడుదల చేసింది. దీనికి సంబంధించిన పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story