Fri Dec 20 2024 01:46:43 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : నేడు యాదాద్రి టు భద్రాద్రి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు యాదాద్రి, భద్రాద్రిలో పర్యటించనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు యాదాద్రి, భద్రాద్రిలో పర్యటించనున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. దీంతో ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకూ బ్రేక్ దర్శనాలను ఆలయ అధికారులు రద్దు చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం...
అనంతరం అక్కడి నుంచి భద్రాద్రి బయలుదేరి వెళ్లనున్నారు. భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. అక్కడ ఇందిరమ్మ ఇళ్ల కార్కక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. తొలుత భద్రాద్రి సీతారామ స్వామిని దర్శించుకోనున్న రేవంత్ రెడ్డి అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రకటించిన హామీని అమలు చేయనున్నారు. సొంత జాగా ఉన్న వారు ఇళ్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నేటి నుంచి అమలు చేయనున్నారు.
Next Story