Wed Apr 23 2025 13:04:25 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : అమెరికాలో కొనసాగుతున్న రేవంత్ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అమెరికాలో కొనసాగుతుంది.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన అమెరికాలో కొనసాగుతుంది. పెట్టుబడులు సాధించే లక్ష్యంగా ఆయన చేస్తున్న పర్యటన సత్ఫలితాలనిస్తుందనే చెప్పాలి. వివిధ పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలతో ఆయన సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఆహ్వానిస్తున్నారు. రేవంత్ రెడ్డి పిలుపునకు మంచి స్పందన లభిస్తుండటంతో రెట్టించిన ఉత్సాహంతో ఆయన వరస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా వివింట్ ఫార్మా కంపెనీ ప్రతినిధులతో రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది.
పెట్టుబడులు పెట్టేందుకు...
హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో అత్యాధునిక ఇంజెక్టబుల్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వివింట్ కంపెనీ ప్రకటించింది. దీని వల్ల వెయ్యి మంది వరకూ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు తమ ప్రభుత్వం రాయితీలు, అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో పాటు కార్నింగ్ ఇన్కార్పొరేటెడ్ సంస్థ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఆ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో కూడా సమావేశమయ్యారు.
Next Story