Mon Dec 23 2024 07:59:45 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : రెండో రోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండోరోజు కొనసాగుతుంది
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండోరోజు కొనసాగుతుంది. నిన్న పార్లమెంటు సభ్యుల ప్రమాణ స్వీకారానికి వెళ్లిన రేవంత్ రెడ్డి బిజిబిజీగా గడిపారు. కేంద్ర మంత్రులను వరసగా కలిశారు. రాష్ట్ర ప్రయోజానల గురించి వారితో చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి నిన్న కేంద్ర మంత్రులతో సమావేశమై చర్చించారు.
నేడు కూడా...
ఈరోజు కూడా కొందరు కేంద్రమంత్రులను రేవంత్ రెడ్డి కలిసే అవకాశముంది. వారితో పాటు పార్టీ పెద్దలను కూడా రేవంత్ రెడ్డి కలవనున్నారని తెలిసింది. రుణమాఫీ అమలు ప్రక్రియను ప్రారంభించేందుకు పార్టీ పెద్దలను ఈ సందర్భంగా రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. దీంతో పాటు మంత్రి వర్గ విస్తరణపై కూడా రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్ తో చర్చించే అవకాశాలున్నాయి.
Next Story