Mon Dec 23 2024 00:14:46 GMT+0000 (Coordinated Universal Time)
నేడు టెన్త్ ఫలితాల విడుదల
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితలు ఈరోజు విడుదల కానున్నాయి
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితలు ఈరోజు విడుదల కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇప్పటికే పరీక్ష ఫలితాల విడుదల కోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత రెండేళ్లుగా టెన్త్ పరీక్షలు కరోనా కారణంగా జరగలేదు. దీంతో రెండేళ్ల తర్వాత ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం నిర్వహించింది.
కొద్దిరోజులుగా...
పదో తరగతి పరీక్షలకు ఐదు లక్షల మందికి పైగానే విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఏడాది 11 ప్రశ్నాపత్రాలతోనే పరీక్షలు నిర్వహించారు. టెన్త్ పరీక్షల ఫలితాల కోసం కొద్దిరోజులుగా విద్యార్థులతోపాటు తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కొంత సమయం తీసుకుని ఈరోజు ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయనుంది.
Next Story