ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరు
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో..
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై ఎట్ హోమ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే రాజ్ భవన్ లో నిర్వహించిన హోట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరు అయ్యారు. అయితే ఈ వరుసగా మూడోసారి ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గైర్హాజరు అయ్యారు. ముఖ్యమంత్రి కేసియారే కాకుండా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం కార్యక్రమానికి దూంగానే ఉ న్నారు.
అలాగే రాజ్ భవన్ లో తమిళి సై మీడియాతో చిట్ చాట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లులపై స్పందించేందుకు ఇది సరైన సమయం కాదని, వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని అన్నారు. కాగా, తెలంగాణలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కేసీఆర్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అలాగే రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సైతం జెండాను ఆవిష్కరించారు.అయితే ప్రతిసారి రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతిసారి సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందినా హాజరు కావడం లేదు. గతంలో కూడా గవర్నర్ తమిళి సైతం కేసీఆర్ గైరర్హాజరుపై ఈ విషయం ప్రస్తావించారు.