Mon Dec 23 2024 04:11:57 GMT+0000 (Coordinated Universal Time)
ఆ రెండు స్థానాల నుండి పోటీ చేయనున్న కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు స్థానాల నుండి పోటీ చేయనున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు స్థానాల నుండి పోటీ చేయనున్నారు. తాజాగా 115 మంది అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ విడుదల చేశారు. అభ్యర్థుల జాబితాలో స్వల్ప మార్పులున్నాయని .. ఏడు సిట్టింగ్ లలో మార్పు చేసినట్టుగా సీఎం కేసీఆర్ చెప్పారు.గజ్వేల్, కామారెడ్డి స్థానాల్లో తాను పోటీ చేయనున్నట్లు సీఎం చెప్పారు. మంచి ముహూర్తం ఉండటంతో జాబితా ప్రకటించినట్లు తెలిపారు. కంటోన్మెంట్ సీటు సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించినట్లు వెల్లడించారు. కొన్ని కారణాలవల్ల ఏడుగురు సిట్టింగు అభ్యర్థులకు టికెట్ నిరాకరించినట్లు సీఎం చెప్పారు. వైరా, ఆసిఫాబాద్, బోథ్, ఉప్పల్ స్థానాల్లో అభ్యర్థులను మార్చినట్లు కేసీఆర్ చెప్పారు.
హుజూరాబాద్ స్థానంలో కౌశిక్‌రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావులు పోటీ చేయనున్నట్లు కేసీఆర్ తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అభ్యర్థన మేరకు ఆ స్థానాని ఆయన కుమారుడు సంజయ్‌కి కేటాయించామని సీఎం తెలిపారు. నాలుగు స్థానాలు మాత్రం పెండింగ్‌లో ఉన్నాయని, ఆక్కడ ఎవరిని నిలబెట్టాలో ఇంకా పరిశీలిస్తున్నట్లు సీఎం చెప్పారు. ఈ సారి కూడా ఎన్నికల్లో ఎంఐఎంతో స్నేహం కొనసాగిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. 2014 నుంచి మిత్రపక్షంగా కొనసాగుతున్న ఎంఐఎం స్నేహాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. ప్రజలు దీవిస్తారనే నమ్మకం తమకు ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.
Next Story