Thu Apr 24 2025 01:46:55 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మహారాష్ట్రకు వెళ్ళనున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మహారాష్ట్రకు వెళ్ళనున్నారు. ముంబైలో కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశం కోసం ఆయన మహారాష్ట్ర వెళ్లనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి ముంబై చేరుకుంటారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికలలో అనుసరించాల్సిన వ్యూహం, రూపొందించాల్సిన మేనిఫెస్టోపై సలహాలు, ఇతర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులతో పాటు ఏఐసీసీ అగ్రనేతలు, ముఖ్యనేతలు పాల్గొననున్నారు.
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఉదయం 8.30 గంటలకు ముంబై బయలుదేరనున్నారు. మహారాష్ట్రలోని కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో కలిసి ఎన్నికల ప్రచారంతో పాల్గొంటారు. అనంతరం అక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. మీడియా సమావేశం అనంతరం మళ్లీ శనివారం రాత్రికే రేవంత్ హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది.
Next Story