Mon Apr 21 2025 09:05:49 GMT+0000 (Coordinated Universal Time)
బస్సు యాత్రకు రాహుల్, ప్రియాంక
తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కొండగట్టు నుంచి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు

తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. కొండగట్టు నుంచి బస్సు యాత్రను ప్రారంభించాలని నిర్ణయించారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో తొలుత బస్సు యాత్ర జరగనుంది. ఈ బస్సు యాత్ర ద్వారా కాంగ్రెస్ నేతల్లో ఐక్యత చాటాలని, ఇప్పటికే ప్రకటించిన ఆరు గ్యారంటీలను కూడా ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
కొండగట్టు నుంచి...
ఈ బస్సుయాత్ర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రానున్నారు. వారి చేత బస్సు యాత్రను ప్రారంభించడానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం సన్నాహాలు చేస్తుంది. త్వరలోనే తొలి జాబితా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పటికే జానారెడ్డి తో పాటు పలువురు నేతలతో కాంగ్రెస్ సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
Next Story