Mon Nov 18 2024 02:36:07 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇక టీపీసీసీ మేనిఫెస్టో..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఇక టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు సమక్షంలో కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. విజయ భేరి బహిరంగ సభలో ఆరు హామీలను ప్రకటించిన కాంగ్రెస్ ఎన్నికలకు సంబంధించిన పూర్తి మేనిఫెస్టోని సిద్ధం చేస్తోంది. ఈ మేరకు అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకొని మేనిఫెస్టోని డిజైన్ చేయబోతున్నారు. అయితే అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండేలా మేనిఫెస్టో ఉండనుందని కమిటి సభ్యులు పేర్కొంటున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి ప్రజల సమస్యలను స్థితిగతులను తెలుసుకొని వాస్తవాల ఆధారంగానే ఈ మేనిఫెస్టో డిజైన్ ఉంటుందని నిర్ణయించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి జిల్లాల పర్యటన ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అక్టోబర్ 2వ తేదీన ఉదయం అదిలాబాద్, సాయంత్రం నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు మానిఫెస్టో కమిటీ సభ్యులు. యువతను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టో కమిటీ కసరత్తు చేస్తోంది. యువతను తమ వైపు తిప్పుకుంటే కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయానికి వచ్చింది కమిటి.
ఆటో డ్రైవర్లకు..
ఇక ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా ఉపయోయోగ పడేలా ఒక మంచి సంక్షేమ పథకాన్ని రూపొందించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఇతర వర్గాలకు ఉపయోగపడే విధంగా మరిన్ని పథకాల రూపకల్పన చేసే విధంగా టీ కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.
Next Story