Mon Dec 23 2024 10:31:21 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జంప్
తెలంగాణ కాంగ్రెస్ కు షాక్ తగిలింది. కీలక నేత మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ కు షాక్ తగిలింది. కీలక నేత బీజేపీలో చేరబోతున్నారు. మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో బీజేపీలో చేరడానికి ఆయన ఢిల్లీకి కూడా చేరుకున్నారు. కొద్దిసేపటికే తరుణ్ చుగ్‌తో భేటీ కానున్నారు. మహేశ్వర్ రెడ్డికి నిన్ననే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆయనకు షోకాజు నోటీసులు జారీ చేశారు.
పీఆర్పీ నుంచి గెలిచి....
అయితే మహేశ్వర్ రెడ్డి గత కొంత కాలంగా పార్టీ హైకమాండ్ పై అసంతృప్తితో ఉన్నారు. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి మహేశ్వర్ రెడ్డి గెలిచారు. ప్రజారాజ్యం నుంచి తర్వాత కాంగ్రెస్ లో చేరారు. నిర్మల్ జిల్లాకు చెందిన మహేశ్వర్ రెడ్డిపార్టీ వీడతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. ఆయన పాదయాత్రకు కూడా పార్టీ హైకమాండ్ నిలిపేసింది. అయితే నిన్నమాత్రం ఖర్గేతో తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడంపై మాట్లాడతానని చెప్పిన మహేశ్వర్ రెడ్డి రేపు బీజేపీలో చేరబోతున్నారని తెలిసింది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ తో ఢిల్లీలో భేటీ అయ్యారు.
Next Story