Fri Dec 27 2024 14:19:48 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ బాధ్యతలను చేపట్టాల్సిందే
కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ చేపట్టాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం కోరింది
కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ గాంధీ చేపట్టాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం కోరింది. ఈ మేరకు తీర్మానంచేసి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఏఐసీసీకి తీర్మానాన్ని పంపింది. కొద్దిసేపటి క్రితం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాహుల్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని తీర్మానం చేసింది.
ఏకగ్రీవంగా ఆమోదం...
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఎమ్మెల్సీ రాములు నాయక్ తీర్మానాన్ని ఆమోదించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈ తీర్మానాన్ని బలపర్చారు. షబ్బీర్ అలీ రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టగా ఏకగ్రీవంగా విస్తృత స్థాయి సమావేశం ఆమోదించింది. కష్టకాలంలో ఉన్న దేశంలో రాహుల్ నాయకత్వంలోనే కాంగ్రెస్ ముందుకు వెళ్లాలని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.
Next Story