Mon Dec 23 2024 08:16:17 GMT+0000 (Coordinated Universal Time)
నేడు టి.కాంగ్రెస్ కీలక భేటీ
తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు కీలక భేటీ కానున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో సమావేశమవుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతలు నేడు కీలక భేటీ కానున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో సమావేశమవుతున్నారు. ప్రధానంగా చేరికలపై లంచ్ మీటింగ్ ను ఏర్పాటు చేయాలని కోమటిరెడ్డికి తెలంగాణ పార్టీ వ్యవహారా ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ సూచించినట్లు తెలిసింది. ఇటీవల మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఎర్ర సత్యం పార్టీలో చేరడంతో కోమటిరెడ్డి అభ్యంతరం తెలిపారు. ఆయనపై కేసులున్నాయని చెప్పారు. తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
లంచ్ మీటింగ్...
దీంతో పాటు వైఎస్ షర్మిల పార్టీ ప్రభావం పై కూడా ఈ లంచ్ మీటింగ్ లో చర్చించనున్నారు. రాహుల్ గాంధీ వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ తెలంగాణ పర్యటనపై కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. బహిరంగ సభ ఏర్పాట్లపై సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ తో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క తో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు.
Next Story