Sun Dec 29 2024 13:07:43 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ తో నేడు కాంగ్రెస్ నేతల భేటీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం జరగనుంది
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సమావేశం కానున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం జరగనుంది. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో నేతలు ఢిల్లీకి ఇప్పటికే చేరుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు, పార్టీ బలోపేతం పై రాహుల్ గాంధీతో చర్చించనున్నారు.
పార్టీ బలోపేతంపై...
సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కూడా రాహుల్ కు నేతలు వివరించనున్నారు. రాహుల్ ను కలిసే నేతల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, మధుయాష్కి, దామోదర రాజనరసింహ, మహేశ్వర్ రెడ్డి తదితరులు రాహుల్ ను కలవనున్నారు.
Next Story