Mon Dec 23 2024 12:22:35 GMT+0000 (Coordinated Universal Time)
Congress : నేడు గాంధీభవన్ లో కీలక భేటీ
కాంగ్రెస్ సమావేశం నేడు గాంధీభవన్ లో జరగనుంది. సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు హాజరు కానున్నారు
తెలంగాణ కాంగ్రెస్ సమావేశం నేడు గాంధీ భవన్ లో జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. నేటి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే ఈ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీతో పాటు మంత్రులు, పీఏసీ, పీఈసీ సభ్యులు కూడా హాజరు కానున్నారు.
లోక్సభ ఎన్నిల నేపథ్యంలో...
ఈ సమావేశంలో ప్రధానంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ సాధించాల్సిన విజయంపై చర్చించనున్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాలను గెలుచుకుని ప్రజామోదం తమకు ఉందని నిరూపించుకోవాలన్న ఉద్దేశ్యం కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తుంది. అందుకే లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్ష చేసే అవకాశముంది. దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేేయాల్సిన ఆరు గ్యారంటీలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా చర్చించనునున్నారు.
Next Story