Sat Nov 23 2024 02:19:09 GMT+0000 (Coordinated Universal Time)
ముర్ముకు ఓటేసిన సీతక్క.. తేడాగా పడిందంటూ?
రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేశారు
రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేశారు. తాను పొరపాటున వేశానని, మరోసారి తనకు అవకాశం కల్పించాలని సీతక్క అధికారులను కోరారు. అయితే అధికారులు మాత్రం మరోసారి ఓటు వేసేందుకు నిరాకరించారు. సీతక్క తన వద్ద ఉన్న బ్యాలెట్ పత్రాలను బాక్స్ లో వేయలేదు. మరొక అదనపు బ్యాలట్ పేపర్ ఇవ్వాలని, తాను మరోసారి ఓటు వేస్తానని సీతక్క కోరుతున్నారు.
మరో బ్యాలట్ పేపర్ కోసం....
తాను తప్పుగా ఓటు వేశానని, మరొక బ్యాలట్ పత్రాన్ని ఇవ్వాలని కోరారు. అందుకు నిబంధనలను అంగీకరించవని అధికారులు చెప్పారు. అయితే సీతక్క కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. ఆదివాసీల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కావాలనే ద్రౌపది ముర్ముకు ఓటు వేశారా? లేక పొరపాటున వేశారా? అన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. దీనిపై విచారణ జరుపుతామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
Next Story