Thu Dec 19 2024 14:45:43 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : డబ్బులు ఎంతిచ్చినా తీసుకోండి.. మిగతా డబ్బులు మేం ఇస్తాం
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని మరోసారి రుజువైందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని మరోసారి రుజువైందని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మీడియా మిత్రులతో చిట్ చాట్ చేశారు. రైతుబంధు కు ఈసీ అనుమతి ఇవ్వడం చూస్తే అర్థం చేసుకోవాలని కోరారు. రైతుబంధు డబ్బులు పడ్డాయని ప్రభావితం కావొద్దని రైతులుకు రేవంత్ విజ్ఞప్తి చేశారు తాము అధికారంలోకి వవచ్చిన వెంటనే ఐదు వేలు ఎక్కువ ఇస్తామని ఆయన తెలిపారు. కేసీఆర్ ఏ పథకం కింద డబ్బులు వేసినా తీసుకోవాలని, ఎంత ఇచ్చినా తీసుకుంటే మిగిలినవి కాంగ్రెస్ ఇస్తుందన్నారు.
ఐటీ దాడులు...
తమ పార్టీ నేతలు పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, చెన్నూరు అభ్యర్థి వివేక్ ఇళ్ల పై ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల దాడులు అందుకే నని తెలిపారు. మాజీ ఐఏఎస్ అధికారి గోయల్ ఇంట్లో 300 కోట్ల డబ్బు ఉన్నా చర్యలు తీసుకోలేదని తెలిపారు. తాము వికాస్ రాజ్ కు ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదన్నారు. పైగా కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారన్నారు బీజేపీ లో ఉంటే వివేక్ మంచి బాలుడని, కాంగ్రెస్ లో ఉంటే రావణాసురుడు లా చిత్రీకరిస్తున్నారన్నారు. కేసీఆర్ పైన బీజేపీ చర్యలు తీసుకోవట్లేదు అని వివేక్ బయటికి వచ్చారని రేవంత్ తెలిపారు.
Next Story