Mon Dec 23 2024 04:44:33 GMT+0000 (Coordinated Universal Time)
నేడు చంచల్గూడ జైలుకు రేవంత్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈరోజు చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పై దాడి కేసులో అరెస్టయిన అభ్యర్థుతలతో ఆయన ములాఖత్ కానున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ప్రధానంగా అరెస్టయిన వారంతా పేద అభ్యర్థులే. వారు సొంతంగా న్యాయవాదిని కూడా నియమించుకోలేని పరిస్థితి. వారి ఆర్థిక పరిస్థితులు సహకరించవు. అందుకోసం వారికి న్యాయసాయం చేయాలన్న ఉద్దేశ్యంతో రేవంత్ రెడ్డి అన్నారు.
న్యాయసాయం...
అగ్నిపథ్ కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. వీరిలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా పేదవారేనని కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. వారు బెయిల్ ప్రయత్నాలు చేసుకోవడం కోసం న్యాయవాదులను కాంగ్రెస్ పార్టీ నియమించనుంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి చంచల్ గూడ జైలుకు వెళ్లి వారితో నేరుగా మాట్లాడనున్నారు.
Next Story